Friday, January 9, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై శ్రీకాంత్

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై శ్రీకాంత్

- Advertisement -

నవతెలంగాణ – శ్రీరంగాపూర్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండలంలోని జౌళి గ్రామంలో వివిధ అంశాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ .. సైబర్ క్రైమ్ పట్ల అందరూ అవగాహన కల్గి ఉండాల ఎవరికి కూడా ఓటీపీ ,పాస్వర్డు లు  తెలుపరాదని,మన ఫోన్ కి వచ్చే అనుమానిత లింకులు, మెసేజ్ లు ఓపెన్ చేయకూడదు అని సూచించారు. సైబర్ నేరానికి గురైనపుడు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. అలాగే  రోడ్డు భద్రత అందరి బాధ్యత తాగి ఎవ్వరు వాహనాలు నడపరాదని అన్నారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది ప్రణీత్ రెడ్డి, లింగరం, శ్రీలత, అనసూయ స్థానిక సర్పంచ్ కొమ్ము సురేందర్ ఉప సర్పంచ్ కుమ్మరి శంకర్  గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -