Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొండచిలువలతో జర భద్రం..

కొండచిలువలతో జర భద్రం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాల్లోని రాత్రిపూట వ్యవసాయ పనులకు వెళ్లి రైతులు జాగ్రత్తగా ఉండాలని ఉండాలి. ఎందుకంటే దారి పొడువునా కొండచిలువలు ఎక్కడైనా కాళ్ళకు కళ్ళెం వేయొచ్చు. వివిధ గ్రామాల సర్పంచులు తెలిపిన వివరాల ప్రకారం.. పడంపల్లి, నాగల్ గావ్, బిజ్జల్ వాడి, కత్తల్ వాడి, లొంగన్ , పెద్ద ఏడ్గి, చిన్న ఏడ్గి , శివారు ప్రాంతాలలో కుండచిలువల సంచారం ఈమధ్య చాలా ఎక్కువైందని ఫారేష్ట్ అధికారులు కూడా సూచిస్తున్నారు. వాతావరణంలో వేడెక్కడంతో విషపూరితమైన సర్పాలు బయటకు వస్తున్నాయని వారు తెలిపారు. రాత్రి పూట పొలాలకు వెళ్ళే రైతులు తప్పని సరిగా కాళ్ళకు చెప్పులు ధరించాలని, వీలైనంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా రైతులు మోటారు స్టార్ట్ చేసే డబ్బా లలో పాములు దాక్కొని ఉంటాయని, ముందుగానే డబ్బా ఓపెన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆచితూచి తీయాలని సూచిస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -