Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానసికంగా దృఢంగా ఉండాలి 

మానసికంగా దృఢంగా ఉండాలి 

- Advertisement -

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని
నవతెలంగాణ – వనపర్తి  

బాలికలు, మహిళలు మానసికంగా దృఢంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లాలోని తెలంగాణ మైనారిటీ బాలికల జూనియర్ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య మానసిక దినోత్సవం సందర్భంగా, శనివారం నిర్వహించుకునే అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, విద్యార్థులకు చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని విద్యార్థులకు బాల్య వివాహాల నిషేధ చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, ఫోక్స్ చట్టం గురించి తెలియజేశారు. డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పట్టికను ఏర్పాటు చేసుకొని చదువుకోవడం వలన మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కళాశాల ప్రధానోపాధ్యాయురాలు హవిళ రాణి పాల్గొన్నారు. 

అనంతరం జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాల భవనంలో ఉపాధ్యాయులకు ప్రజ్వల సంస్థ ద్వారా చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని ఉపాధ్యాయులకు పోక్సో చట్టం, మోటార్ వెహికల్ యాక్ట్, పోష్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి తెలియజేశారు. జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు లీగలే ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ బాలయ్య, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రఘు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలోని ట్రైనింగ్ పొందుతున్న వివిధ రకాల సిబ్బందికి మెంటల్ యాక్ట్స్ మీద అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ పుష్పలత, సైకాలజిస్ట్ సారా ఆర్.ఎం.ఓ జావీద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -