రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సి. సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
ప్రధాన ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సి. సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ, తహశీల్దార్లతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించి సూచనలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించే ముందు ప్రీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసుకోవాల్సి ఉంటుందని, ప్రధాన ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే ఎస్.ఐ.ఆర్. నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఇందుకోసం ముందుగా బూత్ లెవల్ ఆఫీసర్లు, సూపర్వజర్లు, ఈ.ఆర్. ఒ లు, ఎ. ఈ ఆర్. ఒ ల పోస్టులు ఖాళీ లేకుండా భర్తీ చేసుకోవాలని సూచించారు. ఇంతకుముందు 2002లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందని 2002 ఎస్.ఐ.ఆర్. డాటా ను 2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ డేటా తో మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు. 2002లో ఉన్న జిల్లా, నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు, పోలింగ్ స్టేషన్ వారిగా మ్యాచింగ్ బ్యాచింగ్ చేసి పెట్టుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత పార్ట్ నెంబర్, పార్ట్ పేరు 2002 లో ఏ పార్ట్ నెంబరు, పేరుతో ఉందో డేటా తయారు చేసుకుంటామని అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన ఓటర్ల వివరాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహసిల్దార్ రమేష్ రెడ్డి, సెక్షన్ సూపరిండెంట్ మదన్ మోహన్ తదితరులు వి.సి.లో పాల్గొన్నారు.
స్పెషల్ ఎంటెన్సీ రివిజన్ నిర్వహణకు సన్నద్ధం అవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES