ప్రయాణికులకు అవగాహన కల్పించిన రైల్వే పోలీసులు
నవతెలంగాణ – కంఠేశ్వర్
సైబర్ నేరాల పట్ల ప్రజలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం రైల్వే స్టేషన్ ఆవరణంలో గల ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్ పై సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో ప్రయాణికులకు సైబర్ క్రై మ్ కు ఎలా పాల్పడతారు, సైబర్ నేరాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి మాట్లాడుతూ..రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, సైబర్ నేరాల పట్ల అవగాహన ఉంటే తప్ప వాటి నుంచి తప్పించు కోలేరన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని, లోన్ ఇప్పిస్తామని ఫోన్ చేసి సంప్రదిస్తే వాటిని నమ్మవద్దని సూచించారు. అపరిచితులకు బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీ,ఎం ఆధార్, పాన్‌కార్డు ఇతర వివరాలు తెలుపవద్దని అన్నారు. సైబర్ మోసానికి గురైన బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు, సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES