నవతెలంగాణ – మిడ్జిల్
సీజన్లో పశువులకు ,మేకలకు, గొర్లకు, ఆవులకు, గేదెలకు, వచ్చే వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్య డాక్టర్ శివరాజ్ చెప్పారు. గర్భకోశ వ్యాధి నివారణ పరీక్షలు పై గురువారం మండలంలోని ఈదులబాయ్ తాండ గ్రామపంచాయతీలో ఉచిత పశువైద్య శిబిరంలో గర్భకోశ వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా సర్పంచ్ ధర్మానాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శివరాజ్ మాట్లాడుతూ.. పశు వైద్య పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించి 94 పాడి పశువులకు చికిత్సలు, 45 దూడలకు నటల నివారణ మందులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు.
రైతులు ప్రభుత్వం నుంచి వస్తున్న సస్పిడి గడ్డి విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పశు వైద్య సిబ్బందికి సాల్వ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ప్రెసిడెంట్ రవి నాయక్ గోపాల్ మిత్ర సూపర్వైజర్ రవి, పశువైద్య సిబ్బంది ,శ్రీనివాస్, సత్యం, గోపాల మిత్రులు యాదగిరి, నర్సింలు, మల్లేష్, వేణుగోపాల్, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.


