ములుగు డిప్యూటీ డిఎంహెచ్ఓ విపిన్
తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ – తాడ్వాయి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని ములుగు డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ విపిన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, రికార్డులను పరిశీలించారు. డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రభలే సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు ముందు జాగ్రత్తగా రక్త నమూనాలను సేకరించి ఆర్డిటి పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేయాలన్నారు.
ఇంటి ఆవరణలోని టైర్లలో, తొట్టెల్లో, కూలర్లలో నీటి నిల్వ లేకుండా ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు వారి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అందించాలని ఆదేశించారు. అనంతరం డెలివరీ అయిన మహిళ వద్దకు వెళ్లి తల్లి- బిడ్డను పరిశీలించారు. తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్స్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES