- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్ : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కమ్యూనిటీ హెల్త్ అధికారి సిహెచ్. నర్సింగరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీజనవాదుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షపు నీరు నిలువకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో మండల విద్యాధికారి అంబటి అంజయ్య, ఏ ఎవ్ ఏమ్ జి. వరలక్ష్మి ఆశ వర్కర్లు ధనలక్ష్మి, పద్మావతి, సునీత, శైలజ, జానకి, ఉపాధ్యాయులు కొంక ఆంథోనీ, గఫూర్ లు ఉన్నారు
- Advertisement -