-కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్ఫరాజ్ అహ్మద్
నవతెలంగాణ – గంగాధర
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఐఏఎస్ ఆఫీసర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్పరాజ్ అహ్మద్ సూచించారు. గంగాధర మండలం మధురా నగర్ చౌరస్తాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐఏఎస్ ఆఫీసర్ సర్పరాజ్ అహ్మద్ సందర్శించారు. ఆస్పత్రిలోని పరిసరాలను, రోజువారి ఓపి ఫైల్స్ ని ఆయన పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు, వైద్య సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మందులు అందించాలన్నారు.
అనంతరం చౌరస్తాలోని పలు పర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి ఫైల్స్ ను పరిశీలించారు. ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి యూరియా నిల్వలను చెక్ చేశారు.ఈపివోస్ మిషన్ ఆన్లైన్ లో ఫిజికల్ డేటా చెక్ చేసి యూరియా అమ్ముతున్న విధానాన్ని పరిశీలించారు. ఎరువుల స్టాక్ బోర్డుని చెక్ చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ఉందా లేదా అని ఆరా తీసిన ఆయన ఎరువుల దుకాణాల్లో నాణ్యత లేని నకిలీ మందులు అమ్మితే రైతులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఐఏఎస్ సర్పరాజ్ అహ్మద్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, వ్యవసాయ సహాయ సంచాలకులు ప్రియదర్శిని, ఆర్డీవో, ఎంపీడీవో దమ్మని రాము, తహసీల్దార్ అనుపమరావు, పీహెచ్ సీ వైద్యాధికారి శ్వేత, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏఈవోలు వెంకట్, వేదిక, మండల అధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES