నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ
నవతెలంగాణ – కంఠేశ్వర్
సివిజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ తెలియజేశారు. జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపుకు గురై ఇండ్లలోకి, గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో త్రాగునీరు కలుషితమవడం పేరుకుపోయిన నీటి నిల్వల్లో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ ,మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు లాంటి వ్యాధులకు పాటు గాలి ద్వారా శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ జరాలు, దగ్గు, నిమోనియా, కలుషిత నీటి ద్వారా అలసర్, నీళ్ల విరోచనాలు, టైఫాయిడ్, లాంటి సీజనల్ వ్యాధులు ప్రభులే అవకాశం ఉందని జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్వచ్ఛమైన త్రాగునీరు మాత్రమే త్రాగాలని నీటిని కాచి చల్లార్చిన తర్వాత త్రాగాలని అన్ని గ్రామాల్లోని త్రాగునీటి ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ ద్వారా క్లోరినేషన్ను ప్రతిరోజు చేసిన నీటిని త్రాగాలని సూచించారు.
తద్వారా అతి సార, నీళ్ల విరోచనాలు, టైఫాయిడ్, హెపటైటిస్, లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అదేవిధంగా ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని తాజా కూరగాయలను వాడాలని శుభ్రంగా కడిగిన తర్వాతే వండాలని తెలిపారు. ఆహార పదార్థాలపై మూతలను పెట్టాలని సూచించారు. వర్షాల కారణంగా ఏర్పడిన నీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ ను వదలాలని, ప్రజలందరూ దోమతెరలను వాడాలని, దోమలు ఇళ్లలోకి రాకుండా కిటికీలకు డోర్లకు జాలీలను అమర్చాలని, ప్రజలు ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా గుమి కూడదు అన్నారు. ఒకరి ద్వారా ఒకరికి చర్మ వ్యాధులు అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.ప్రజలు ఎవరు కూడా గ్రామానికి దగ్గరలో కాలువలు,వాగులు, చెరువులు, దగ్గరికి వెళ్లి నీళ్లలో ముంపునకు గురై ప్రాణాలు వదలరాదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో పాములు పేర్లు క్రిమి కీటకాలు విష సర్పాలు కాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వర్షాల కారణంగా ఏర్పడిన స్థితిలో వల్ల కరెంటు స్తంభాలు నింగిపోవడం కరెంట్ వైర్లు వంగడంతో ప్రజలు ఎవ్వరు విద్యుత్ లేదా కరెంటు షాకో గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వరదలు ఏర్పడిన మబ్బు గ్రామాల్లో కానీ పునరావాస కేంద్రాల్లో గాని ప్రజలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు చేసి చికిత్స అందించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు పాముకాటు టీకాలు అందుబాటులో ఉన్నాయని సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు సరిపడా మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా 59 ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు అందులో మొత్తం 2334 మంది రోగులను పరీక్షించి చికిత్స అందించడం జరిగిందన్నారు.