ఎస్ఐ బిట్ల పెర్సిస్
నవతెలంగాణ – ముధోల్
ప్రతి ఒక్కరు సైబర్ ఆర్థిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్ అన్నారు. ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో మంగళవారం రాత్రి పోలిస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాల పట్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా సైబర్ నేరాల పై విడియో రూపంలో ప్రదర్శించారు.అలాగే మూఢనమ్మకాల పై ప్రముఖ మెజిషన్ సుధాకర్ అవగాహన కల్పించారు.ఆనంతరం ఎస్ఐ మాట్లాడారు.
అపరిచిత వ్యక్తులు పోన్ చేస్తే ఓటిపి చెప్పవద్దున్నారు. బ్యాంకు వారు నేరుగా ఎప్పుడూ పోన్ చేయరని తెలిపారు. ఈవిషయం ను ప్రతి ఒక్కరు గమనించగలరని సూచించారు. ఇలాంటి పోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా పోన్ కాల్స్ వస్తే పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని అన్నారు. గ్రామాల్లో బాబాల మోసాలు పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. యువకులు మత్తు పదార్థాల వాడకాన్నికి దూరంగా ఉండాలన్నారు. ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే పోలిసులకు తెలియజేయలన్నారు.గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేయించుకోవాలని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పని సారిగా పాటించాలన్నారు.నిర్మల్ పోలిస్ మీ పోలిసు పనిచేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో గ్రామస్తులు, పాల్గొన్నారు.



