నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ కు చెందిన దివ్యాంగులు సట్లోళ్ల లక్ష్మణ్, గొల్ల మల్లన్న, సొన్కాంబ్లే సంతోష్ కు తన వంతు సామాజిక బాధ్యతగా వాకర్లు- హ్యాండ్ స్టిక్ ను మంగళవారం స్థానికుడు గడ్డం సుభాష్ గ్రామ పెద్దల సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వంతు బాధ్యతగా సామాజిక సేవలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సమాజసేవలో పాల్గొనాలని కోరారు. ముందుకు వచ్చి దివ్యాంగులకు వాకర్లు, హ్యాండ్ స్టిక్ లను పంపిణీ చేసిన సుభాష్ ను గ్రామ పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ బీడీసీ అధ్యక్షుడు గుంజలోల్ల నారాయణ, గ్రామ పెద్దలు ఇడేపొల్లా లక్ష్మన్న, సంజు పటేల్, తన్వీర్, వాగ్మారే జల్బ పోశెట్టి, అశోక్, నిమొల్ల గంగాధర్, సిరిపల్లి ప్రసాద్, ప్రవీణ్, నవీన్, ప్రసాద్, లక్ష్మణ్, శైలు, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు గడ్డం సుభాష్ చేయుత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES