Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు 

రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు 

- Advertisement -
  • – మండల వ్యవసాయ శాఖ అధికారి కె. ఎస్. కుమార్ యాదవ్
    నవతెలంగాణ -తాడ్వాయి 
  • మండలంలోని రైతులకు జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, పచ్చి రొట్టె భూసారం పెంచడంలో దిట్ట అని, మండల వ్యవసాయ శాఖ అధికారి కాసాని. సోమ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నవతెలంగాణ తో మాట్లాడారు. మండలంలో సబ్సిడీపై అందుబాటులోకి 30 కింటాలు, 100 బస్తాలు జీలుగు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు.  పచ్చిరొట్టె భూసారం పెంచడంలో దిట్టని తెలిపారు.
  •  
  • రాబోవు వానాకాలం 2025-26 సీజన్ కు గాను రాయితీ పై జీలుగ విత్తనాలు 30 క్వింటాళ్ళు మండలంలోని కార్యాలయం నందు  విత్తనాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ఇట్టి పచ్చి రొట్ట జీలుగా విత్తనాలు కిలోకు మొత్తం ధర రూ.142.50, ప్రభుత్వ రాయితీపై రూ.71.25, రైతువాట రూ. 71.25 ఉంటుందన్నారు.ఎకరానికి 12 కిలోల చొప్పున ఒక బస్తా(30కిలోలు) రెండున్నర ఎకరాలకు సరిపోతుందన్నారు. వరి పంట మిరప పంట వేసే రైతులు తప్పనిసరిగా ఈ పచ్చి రోట్ట విత్తనాలు తోలకరిలో దుక్కి దున్ని చల్లుకొని 45 రోజుల తర్వాత పూత దశలో భూమిలో కలియదున్నుకొన్నచో భూమి సారవంతం కావడమే కాక పంట దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. ఇట్టి జీలుగ విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ ప్రతితో మండల వ్యవసాయధికారి కార్యాలయంలో సంప్రదించగలరని పేర్కొన్నారు. ఒక బస్తా (30కిలోల) జీలుగ విత్తనాలు రూ 2137.50 ఉంటుందన్నారు. దీనిని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -