Sunday, March 1, 2026
E-PAPER
Homeసినిమాఅందమైన పెళ్ళి పాట..

అందమైన పెళ్ళి పాట..

- Advertisement -

విజయ్‌ దేవరకొండ, రశ్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ‘రణబాలి’ మూవీ టీమ్‌ ఈ చిత్రంలోని బ్యూటీఫుల్‌ వెడ్డింగ్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు.
ఈ భారీ పాన్‌ ఇండియా మూవీలో విజరు రణ బాలిగా, రశ్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో వీరి పెళ్లి వేడుక సందర్భంగా ఓ అందమైన పాట చిత్రీకరించారు.
ఈ పాటలో అప్పట్లో పెళ్లి సందడి ఎంత సంప్ర దాయంగా ఉండేదో చూపించారు.
‘ఎందయ్య సామీ, ఇంత కాస్తాందీ వెన్నెల, ఊపేస్తా వుంది సిత్తరాల ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిం దెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరామన్నారా…’ అంటూ సాగుతుందీ పాట.
మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అజరు – అతుల్‌ బ్యూటీిఫుల్‌గా ఈ పాటను కంపోజ్‌ చేశారు. రాహుల్‌ సంకత్యన్‌ దర్శకత్వంలో టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ఈ సినిమాను నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ రిలీజ్‌కు ఈ సినిమా రాబోతోంది. 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్‌ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -