Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్అందాల పోటీలను రద్దు చేయాలి

అందాల పోటీలను రద్దు చేయాలి

- Advertisement -

అందాల పోటీలకు వ్యతిరేకంగా కండ్లకు గంతలు కట్టుకొని నిరసన 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: 72 మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలి అని, ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని, జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం బుధవారం చేశారు. ఈ సందర్భంగా నాయకులు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్య, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత,  పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు అరుణ, స్త్రీ ముక్తి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పోసాని, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న హత్యలు లైంగికదాడులు, విద్యా వైద్యం, ఉద్యోగం, ఉపాధి, అవుట్సోర్సింగ్, కార్మికులకు వేతనాలు, ఇండ్ల నిర్మాణం, పింఛను, వీటి మీద దృష్టి పెట్టకుండా మిస్ వరల్డ్ అందాల పోటీల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం సీఎం మానుకోవాలని అన్నారు. ఈ పోటీలను పెట్టడం కరెక్ట్ కాదని, మహిళా సంఘాలు సీఎం కి లేఖలు పంపినా కూడా ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు లేకపోవడం బాధాకరమన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి,  నాయకులు అమూల్య, మంజుల, గీత,  పి ఓ డబ్ల్యు కార్యదర్శి భారతి,  నాయకులు సంజన,  లక్ష్మి,  ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు,పిడిఎస్యు జిల్లా నాయకులు సంతోష్, మహిపాల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -