Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅందాల పోటీలు రద్దు చేయాలి

అందాల పోటీలు రద్దు చేయాలి

- Advertisement -

– మహిళలను వ్యాపార వస్తువుగా చూడొద్దు
– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
– గచ్చిబౌలి స్టేడియం ఎదుట ఐద్వా, పీవోడబ్ల్యూ నిరసన
– నేతలను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మహిళలను వ్యాపార వస్తువులుగా చూసే సంస్కృతి పోవాలనీ, దానికి బీజం వేసే విధంగా ఉన్న అందాల పోటీలను రద్దు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అరెస్టు చేసిన మహిళా నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం మిస్‌వరల్డ్‌ పోటీలు జరుగుతున్న ప్రాంతమైన గచ్చిబౌలి స్టేడియం ఎదుట ఆయా సంఘాలు ఆందోళనకు దిగాయి. మహిళలను వ్యాపార వస్తువుగా చూస్తున్న పాలకుల తీరుపట్ల ఐద్వా, పీవోడబ్ల్యూతో పాటు ఆయా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్‌ ఆశాలత, ఉపాధ్యక్షులు శశికళ, పీవోడబ్ల్యూ నేత సంధ్య, ఝాన్సీ, ఐద్వా నాయకులు వినోద, వరలక్ష్మి, లక్ష్మమ్మ, సృజన, మంగ, కవిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసి మొయినాబాద్‌ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img