Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్అమ్మ కావడం.. ఓ గొప్ప వరం

అమ్మ కావడం.. ఓ గొప్ప వరం

- Advertisement -

డా. కిరణ టి.ప్రసిద్ధ.. ఫెర్టిలిటీ నిపుణురాలు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: అమ్మ కావడం ఓ గొప్ప వరం అని ప్రసిద్ధ ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ కిరణ మదర్స్ డే ను  పురస్కరించుకొని నవ తెలంగాణతో తెలిపారు. తల్లి ఈ పదం మన హృదయంలో ఏదో తెలియని వెదుకులాటను, ఓ ప్రేమను, ఓ రక్షణను, ఓ భద్రతను తెస్తుంది. ఈ ప్రపంచంలో మాతృత్వం మించిన బంధం లేదు. మాతృదినోత్సవం అనేది ఈ పవిత్రమైన బంధాన్ని స్మరించుకునే ప్రత్యేకమైన రోజు. నన్ను అడిగితే ప్రతి రోజు మాతృదినోత్సవం.  తల్లి అనే ఈ ఒక్క పదంలో బ్రహ్మాండమైన ప్రేమ దాగుంది. తల్లి మన తొలి గురువు, తొలి వైద్యురాలు, తొలి స్నేహితురాలు. ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌గా నా ప్రయాణం ప్రారంభమయ్యే ముందునుంచే, నన్ను నిస్వార్థంగా సేవ చేసే మార్గంలో నడిపించినది నా తల్లే. తల్లి అయ్యే కలతో ఎంతో మంది మహిళలు నా దగ్గరకు చికిత్స కోసం వస్తారు. ప్రతి మెరుగైన వైద్యం వెనక వారి ఆశలు, కన్నీళ్లు, కలలు ఉంటాయి. మాతృత్వం పొందాలనే ఆశలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అధిగమించడమే నా సదా లక్ష్యం. ఈ మాతృదినోత్సవం సందర్భంగా.. తల్లయిన ప్రతి మహిళకు నా శత కోటి వందనాలు. ఇంకా తల్లి అవ్వాలని ఎదురు చూస్తున్న ప్రతి మహిళకు నా ప్రేరణ, నా ఆశీర్వాదం. మాతృత్వం ఈ ప్రపంచానికి వెలుగుకిరణం. ఈ మాతృదినోత్సవం సందర్బంగా మనం ఒక్కసారి ఆ తల్లిని స్మరించుకుందాం.. ఆ ప్రేమను గౌరవించుకుందాం..ఆ బంధాన్ని సెలబ్రేట్ చేద్దాం.
తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే జీవితం. అమ్మలందరికీ  మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నా చిన్ననాటి సమయంలో తల్లి మంజుల బాయి ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేసి రిటైర్ అయ్యారని, చిన్ననాటి నుండి తను చెప్పిన మాటలు వింటూ పెరగాలని తెలిపారు. అమ్మ తన కోసం ఏమీ ఆశించదు. తన బిడ్డలకు కావాల్సినవన్నీ ఇచ్చి తన సంతోషాలను తన బిడ్డలలో చూసుకుంటుంది అమ్మ. అలాంటి అమ్మే మంజుల బాయి. మంజుల బాయి కేవలం చదువు మీదనే దృష్టి పెట్టే విధంగా కాక, అన్ని రకాలుగా ప్రోత్సహించింది. మంజులబాయి భర్త  ఆర్మీ ఉద్యోగంలో ఉన్నప్పటికీ పిల్లలందరినీ చదివించింది మా అమ్మ. నేను  మంచిగా చదివి వైద్యురాలిగా ఎదిగి వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కిరణ తెలిపారు. నా భవిష్యత్తు కోసం అమ్మ పడిన కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని నవతెలంగాణతో తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -