Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసహాకార సంఘాల ద్వారానే బెడ్‌ షీట్లు కొనుగోలు చేయాలి

సహాకార సంఘాల ద్వారానే బెడ్‌ షీట్లు కొనుగోలు చేయాలి

- Advertisement -

– ప్రభుత్వానికి చేనేత కార్మిక సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఇప్పటి వరకు ఉన్న టెండర్లు రద్దు చేసి సహకార సంఘాల ద్వారానే బెడ్‌ షీట్లు, డరీస్‌ కొనుగోలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు శుక్రవారం ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, మైనింగ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఈరావత్‌ అనిల్‌ కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్‌, చేనేత దినోత్సవ రూపకర్త ఎర్రమాద వెంకన్న నేత, చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు చిక్కా దేవదాసు, బీసీ ఇంటలెక్చువల్‌ ఫోరమ్‌ నాయకులు కర్నాటి మనోహర్‌, ఆల్‌ ఇండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బాసాబత్తిని రాజేశం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళీ తదితరులు పాల్గొన్నారు. వేంనరేందర్‌రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో 26 నుండి 27లక్షల మంది విద్యార్థులకు 23 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను పాఠశాలు ప్రారంభించిన రోజున్నే విద్యార్థులకు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందుకు నాణ్యమైన వస్త్రం కావాలనీ, మే 30 వరకు సప్లై చేయాలని సూచించారు. మగ్గాలపై తయారు చేసిందే వాడాలని తెలిపారు. మిగతా సమస్యలు త్వరలో చర్చిద్దామని హమీ ఇచ్చినట్టు సంఘాల నేతలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -