నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని బీడీ కార్మికుల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కర్రెవార్ సావిత్రీ సాయగౌడ్ కు, మాజీ సర్పంచ్ బొంపెల్లి వార్ రాములు , ఉప సర్పంచ్ షేక్ ఫిర్దొస్, చంద్రకళ (వార్డు మెంబర్),బొంపెల్లి వార్ విజయ్ కుమార్, గైక్వాడ్ నర్సింగ్ గారికి జుక్కల్ బీడీ కార్మికుల అధ్యక్షురాలు మద్దెల రాధ మరియు బీడీ కార్మికుల ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రే వార్ సావిత్రి మాట్లాడుతూ.. బీడీలు చుట్టే కార్మికులు నిత్యము వారికి పనికి తగ్గ వేతనాలు రావడం లదని అన్నారు. నిన్ను ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ తరఫున బీడీ కార్మికులకు ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని వారి సమస్యల పరిష్కారానికి ఎల్లవేళల కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీడీ కార్మికులు, పెద్దలు బాబాన్న, పాపయ్య,మహేష్, సందీప్(టేకేదార్) తదితరులు పాల్గొనడం జరిగింది.
జుక్కల్ సర్పంచ్ ను సన్మానించిన బీడీ కార్మికులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



