Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు

సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు

- Advertisement -

– కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేసిన బీడీ కార్మిక సంఘం నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీడీ కార్మికుల సమస్యలతో పాటు దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా వచ్చే నెల 12న కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు పాల్గొంటున్నారని తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె గోపాలస్వామి, ఎస్వీ రమ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం కార్మిక శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలనీ, విద్యుత్‌ సవరణ చట్టం-2025ను ఉపసంహారించుకోవాలనీ, పేదలకు పనికి గ్యారంటీ కల్పిస్తున్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ చట్టాన్ని కొసాగించాలని తదితర కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జరిగే ఒక్క రోజు సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు పాల్గొంటారని తెలిపారు. బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.807 ఇవ్వాలనీ, బీడీ ప్యాకర్లు, సార్టర్‌, ట్రైపిల్లర్‌ నెలవారి వేతనాలు పొందే కార్మికుల కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్లర్క్‌ చెక్కర్స్‌, బట్టీ కార్మికులు నెలవారి వేతనాలు పొందే వివిధ క్యాటగిరీల కార్మికులందరికీ కనీస వేతనం ఇవ్వాలనీ, నెలకు 26రోజులు పని కల్పించాలనీ, పీఎఫ్‌,ఈఎస్‌ఐ,బోనస్‌, చట్టాలను విధిగా అమలు చేయాలనీ, వెయ్యి బీడీలకు నాణ్యమైన ఆకు, తంబాకు ఇవ్వాలనీ, నెలకు సరిపడా ఆకు ఒకే సారి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -