Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి

ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి

- Advertisement -

– వైస్ ఛైర్మన్ గా అంగడి ఆంజనేయులు 
– కౌన్సిలర్లను దగ్గరుండి మున్సిపల్ కార్యాలయానికి చేర్చిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య 

నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి కి  చెందిన కౌన్సిలర్లను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ బండ్రు శోభారాణి దగ్గరుండి, క్యాంపు నుండి నేరుగా ప్రత్యేక బస్సులో, మున్సిపల్ కార్యాలయానికి తీసుకు వచ్చి నూతన కౌన్సిలర్లను అభినందించారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి  పూర్తి కోరం ఉండడంతో, సోమవారం జరిగిన కౌన్సిలర్ల పదవి ప్రమాణస్వీకారం అనంతరం ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దైవసాక్షిగా, ఆత్మసాక్షిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్మన్ గా అంగిడి ఆంజనేయులు దైవసాక్షిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆత్మ సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారులు శ్రీనివాస్ రెడ్డి, తాసిల్దార్ వి. ఆంజనేయులు, మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్, రెండవ వార్డు కౌన్సిలర్ వాన రాశి మరియమ్మ, 9వ వార్డు కౌన్సిలర్  పస్తం ఆంజనేయులు, 10 వ వార్డు కౌన్సిలర్ మల్లెల సరిత, 11వ వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్ , 12వ వార్డు కౌన్సిలర్ జట్ట నీరజ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -