- Advertisement -
నవతెలంగాణ – తొగుట
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు సొసైటీల వద్ద పడి కాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. శని వారం రైతులకు అవసరమైన యూరియా అందు బాటులో లేకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు అరకోరగా వస్తున్న యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. తొగుట మండల కేంద్రంతో పాటు, కాన్గల్ గ్రామాల్లో ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘానికి ఉదయం యూరియా లోడ్ వస్తుందన్న విషయం తెలుసు కున్న రైతులు సహకార సంఘ పరిధిలోని మనుషులకు బదులు బీరు సీసాలు, మందు సీసాలు, చెప్పులు క్యూ లైన్ లో పెట్టారు.
- Advertisement -