- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం కళ్లెం అండాలు,కిష్టయ్య దంపతుల కుమార్తె వివాహానికి బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత మాట్లాడుతూ.. సామాజిక సేవే తమ లక్ష్యమని, ముఖ్యంగా పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయం చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అవసరమున్న ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత సాయం అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
- Advertisement -