ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకట రత్నం
నవతెలంగాణ – అశ్వారావుపేట: ప్రమాదం ఏదైనా పనిలో అప్రమత్తంగా ఉన్నప్పుడే నివారించవచ్చని ఎన్పీడీసీఎల్ ఏడీఈ (ఆపరేషన్స్) వెంకటరత్నం అన్నారు. మంగళవారం ఎన్పీడీసీఎల్ అశ్వారావుపేట సబ్ – డివిజన్ పరిధిలో అశ్వారావుపేట సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన విధ్యుత్ భద్రత వారోత్సవాలు పురస్కరించుకొని సబ్ డివిజన్ పరిధిలో గల విద్యుత్ సిబ్బందికి ప్రమాదాల నివారణకు పాటించవలసిన భద్రతా ప్రమాణాలు మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ అవగాహనా సదస్సులో ఏడిఈ బి.వెంకటరత్నం అధ్యక్షతన ఈ సభలో ముఖ్య అతిధులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డి ఈ టెక్నికల్, ఎన్.కృష్ణ,పాల్వంచ డివిజనల్ ఇంజనీర్ పీ వీ ఎస్ ఎన్.నందయ్య హాజరయి విధ్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన భద్రత ప్రమాణాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ బి.విజయ్ కుమార్ విధ్యుత్ ప్రమాదానికి గురి అయిన సందర్భాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా సి పి ర్ పైన అవగాహన కల్పించారు. సభలో ప్రసంగించిన అధికారులు విధ్యుత్ సిబ్బంది ఎల్ సి లు ఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా మాత్రమే తీసుకోవాలని,ఎర్త్ డిశ్చార్జ్ రాడ్స్ తప్ప కుండ ఉపయోగించాలని, అన్ని రకాలుగా లైన్లో విధ్యుత్ లేదు అని నిర్ధారించిన తర్వాతనే మరమ్మతులు చేసి విధ్యుత్ ప్రమాదాలు నివారించాలని సిబ్బందికి తెలిపారు. ఈ భద్రతా వారోత్సవానికి అశ్వారావుపేట ఏ ఈ జి. రవి, దమ్మపేట ఏ ఈ ఏ సాయి కిరణ్, గండుగులపల్లి ఏ ఈ రమేష్, సబ్ ఇంజనీర్స్ ఎం శివ శంకర్, కె. విజయ్ కృష్ణ, సబ్ డివిజన్ పరిధిలో గల సిబ్బంది అందరు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు అప్రమత్తతే ముఖ్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES