నవతెలంగాణ – సదాశివ నగర్
సదాశివ నగర్ ఎస్సై పుష్పరాజ్ అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మధ్యకాలంలో తాళాలు వేసిన ఇండ్లలోనే దొంగతనాలు జరుగుతున్నాయి. అందువలన మీరు ఎక్కడికన్నా బంధువుల వద్ద కానీ ఇతర తీర్థయాత్రలకు గాని బయలుదేరినప్పుడు మీ ఇంట్లో బంధువులను ఉంచి వెళ్లాలని ఎస్సై పుష్పరాజ్ సూచించారు.
ఇంట్లో ఎవరినై న ఉంచి వెళ్లాలని అన్నారు. మీ ఇంట్లో రాత్రి ఎవరు లేకపోవడంతో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారము ఇవ్వాలని సూచించారు .అందరం కలిసి గ్రామాలను సురక్షింగా ఉంచుకుందామని అన్నారు విలువైన వస్తువులు ఉంటే వెంట తీసుకెళ్లండి లేకుంటే బంధువుల వద్ద నమ్మకమైన వ్యక్తుల వద్ద ఉంచి వెళ్లాలని అన్నారు.
అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు: ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES