ఎన్ పి ఆర్ డి వికలాంగుల జిల్లా అధ్యక్షుడు మీసాల కురుమయ్య
నవతెలంగాణ – తిమ్మాజిపేట
వికలాంగుల సహాయ పరికరాలకు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని ఎన్ పి ఆర్ డి వికలాంగుల జిల్లా అధ్యక్షుడు మీసాల కురుమయ్య నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్న కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల కుర్మయ్య మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన వికలాంగుల సహాయ పరికరాలను లబ్ధిదారులకు చట్టప్రకారం ఇవ్వాలని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక (ఎన్ పి ఆర్ డి) సంఘం ద్వారా కోరుతున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపిక రహస్యంగా రాజకీయ ఒత్తిడితో చేస్తున్నారని మాకు సమాచారం ఉందని ఆ విధంగా చేస్తే నిజమైన వికలాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
వికలాంగుల సహాయ పరికరాల కోసం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES