ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
నవతెలంగాణ – జోగులంబ గద్వాల
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిపొందిన లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్ల గృహప్రవేశం చేసి త్వరగా ఇళ్లలోకి త్వరగా వెళ్లాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని పరుమాల శివారు నందు గల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దగ్గర ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను ఎమ్మెల్యే పరిశీంచారు. ఇప్పటికే గృహప్రవేశం చేసిన ప్రజలతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో నీటి సమస్యను పరిష్కారిస్తామని, అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనారు.
ఇల్లు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడిన పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేరింది కానీ లబ్ధి పొందిన లబ్ధిదారులు ఇంకా ఇండ్లలో నివాసం ఉండలేరు కాబట్టి త్వరగా ఎంపికైన లబ్ధిదారులు త్వరగా ఇండ్లను గృహప్రవేశం చేసుకొని ఈ ప్రాంతంలో నివసించాలని అని పేర్కొన్నారు.
ఇప్పటికే వరకు నీటి సమస్య విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరిగింది లబ్ధిదారులు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని కూడా త్వరగా నాలుగు రోజుల పూర్తి చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు అజయ్ చంద్రశేఖర్ ధర్మ నాయుడు, బాలాజీ, మొయినుద్దీన్ పరశురాముడు షాషా రాజు పాల్గొన్నారు.