Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్రపటాలకి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మండల రామచందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వెంకటాపూర్ గ్రామంలో ప్రభుత్వం సుమారు 20 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న వారికి మొదటి విడతగా లక్ష రూపాయలు అందించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.అంతేకాకుండా అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకుపోయేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు , గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -