– హౌసింగ్ ఏఈ కవిత..
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండలంలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ కవిత అన్నారు. బుధవారం ఊరుకొండ మండల పరిధిలోని గుండ్లగుంటపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ రమేష్ నాయక్ అధ్యక్షతన హౌసింగ్ ఏఈ కవిత ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ కవిత మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇళ్లను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకుంటే ఇంటి బిల్లులు సకాలంలో తమ ఖాతాలో జమ అయ్యేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొండల్, పంచాయతీ సెక్రెటరీ సాయి రూప, మరియు వార్డ్ సభ్యులు మల్లీశ్వరి, ధర్మరాజు, దామోదర్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



