అన్ని కాలాల్లో విరివిగా దొరికే జామకాయలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. అయితే రోజుకు ఎంత మోతాదులో వీటిని తినాలి? అనే దానిపై చాలామందికి స్పష్టత లేదు. పోషకాహార నిపుణుల సలహా ప్రకారం రోజుకి 100 గ్రాముల జామ కాయలు తినొచ్చు. అంతకు మించితే జీర్ణ సమస్యలు వస్తాయి. మితంగా జామకాయలను తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.
డయాబెటిస్ ఉన్నవారికి..
జామకాయలు లేదా పండ్లు పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. వీటిల్లో మన శరీరానికి కావల్సిన అనేక విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే పోషకాహార లోపం తగ్గుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గేలా చేస్తుంది. రోగాలు రాకుండా చూస్తుంది. జామ పండ్లలో ఉండే అధిక ఫైబర్‌వల్ల మలబద్దకం తగ్గుతుంది.
షుగర్‌తో బాధపడేవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఈ కాయల గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందువల్ల వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా వీటిల్లో ఉండే ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి.
గుండె ఆరోగ్యానికి..
ఈ కాయల్లో పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటుని నియంత్రిస్తాయి. రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
ఈ కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా వీటిని తింటే చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆక్సీకిరణ ఒత్తిడి తగ్గి, వద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం యవ్వనంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది.
జామకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కాయలను తింటే గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి.
రోగ నిరోధక వ్యవస్థకు..
జామకాయలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జామకాయలను తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది.
దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. గులాబి రంగులో ఉండే జామకాయల్లో విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడంతోపాటు రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
జామతో ప్రయోజనాలు
- Advertisement -
- Advertisement -


