Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయంబెంగాల్ లైంగిక దాడి కేసు: కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన బాధితురాలు

బెంగాల్ లైంగిక దాడి కేసు: కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన బాధితురాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కోల్‌కతా ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన మరవక ముందే మ‌రో వైద్య విద్యార్థిపై సాముహిక లైంగిక దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, ఈ కేసులో బాధితురాలు తన వాంగ్ములంలో జరిగిన భయానక అనుభవాలను వెల్లడించింది. ‘‘వారు తమ వాహనాన్ని వదిలి మా వైపు వస్తున్నట్లు గమనించాము. మేము అటవి వైపు పరిగెత్తడం ప్రారంభించాము. అప్పుడు ముగ్గురు వ్యక్తులు మా వెంట పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను పట్టుకుని, అడవిలోకి లాక్కెళ్లారు’’ అని చెప్పింది. నిందితులు తన ఫోన్‌ని లాక్కుని, తన స్నేహితుడికి ఫోన్ చేయాలని బలవంతం చేశారని వెల్లడించింది. ‘‘తనను బలవంతంగా పడుకోపెట్టారు. నేను అరిచినప్పుడు, శబ్ధం చేస్తే, మరింత మంది మగవాళ్లకు ఫోన్ చేస్తాం వారు కూడా వచ్చి లైంగిక దాడి చేస్తారు’’ అని బెదిరించినట్లు చెప్పింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -