హైదరాబాద్ : ప్రముఖ ఇంజనీరింగ్ టెక్ దిగ్గజం బెంట్లే సిస్టమ్స్ గురువారం హైదరాబాద్‌లో తమ అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లను ప్రదర్శించింది. ఇవి భారతదేశంలో మెట్రో, నీటి సరఫరా, విద్యుత్ రవాణా, ఎయిర్‌పోర్ట్ విస్తరణ, 3డి సిటీ మ్యాపింగ్ వంటి బహుళ రంగాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయని బ్రెంట్లే సిస్టమ్స్ సౌత్ ఏసియా రీజినల్ ఎగ్జిక్యూటివ్ కమలకన్నన్ తిరువది తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన బెంట్లే ఇన్నోవేషన్ డేలో పాల్గొన్న కమలకన్నన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ సాఫ్ట్‌వేర్ జల్ జీవన్ మిషన్, అమృత్ ప్రాజెక్ట్, నాగ్‌పూర్‌లో నీటి లీకేజీ తగ్గింపు వంటి కీలక ప్రాజెక్టులలో డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ద్వారా ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నిర్వహణ దశలను సమర్థవంతంగా నిర్వహిస్తోన్నామన్నారు. నాగ్‌పూర్‌లో నీటి లీకేజీ తగ్గింపు వంటి ప్రాజెక్టులలో డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ద్వారా ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, నిర్వహణ దశలను సమర్థవంతంగా నిర్వహిస్తోన్నామన్నారు. విద్యుత్ రంగంలో ట్రాన్స్‌మిషన్ టవర్‌ల డిజైన్, నిర్వహణ, 3డి మోడలింగ్‌లో బెంట్లే సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతోందన్నారు.