నవతెలంగాణ – ఆర్మూర్
సావిత్రిబాయి పూలే బర్త్ యానివర్సరీ సందర్భంగా శనివారం మండల ప్రజా పరిషత్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ రాజ గంగారం మండలంలోని వివిధ జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్మైల్ స్కూల్ ఆర్మూర్ కు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజ్మెంట్ అవార్డు తో డైరెక్టర్ రఫీ గౌహర్ ను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రఫీ గౌహర్ మాట్లాడుతూ ఈ అవార్డు స్మైల్ స్కూల్ కు రావడం అదృష్టంగా భావిస్తున్నాం సన్మానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు మాకు ఈ గౌరవం ప్రసాదించడంలో ఎంఈఓ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఎంఈఓ రాజా గంగారాం మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే భారతీయ మహిళా హక్కుల కార్యకర్త, సంఘ సంస్కర్త ఉపాధ్యాయురాలు. ఆమెను భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పరిగణిస్తారు. 19వ శతాబ్దంలో మహిళల మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె పోరాడారు అని చెప్పారు. మండలంలోని పి ప్రీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు నాగరాజు ను సైతం సన్మానించారు. ఇ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ ప్రధానోపాధ్యాయులు నరసయ్య జడ్పీహెచ్ఎస్ పెర్కిట్ హెచ్ఎం శ్రీనివాస్ పిఆర్టియు సంఘం బాధ్యులు ఈ గోపాల్ ,లక్ష్మణ్, జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు జడ్.పి.హెచ్.ఎస్ గర్ల్స్ ప్రాధనో పాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



