మెస్, కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలి. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలి
ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత
నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, విద్యార్థుల చదువుకు ఆటకం కాకుండా బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న మిస్ కాస్మోటీ ఛార్జీలు విడుదల చేయాలని సంక్షేమ హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భువనగిరిలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మెడబోయిన మమత హాజరై మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించేం దుకు గత 25 క్రితం బెస్ట్ అవైలబుట్ స్కీంను ప్రవేశపెట్టాతన్నారు.
ప్రాథమిక తరగతిలో ఒక్కో విద్యార్థికి ఏటా రూ.28.000, ప్రాథమికోన్నత తరగతిలో వసతితో కలిసి రూ.42,000 చొప్పున చెల్లిస్తారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఎంపిక చేసిన 230 ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య,భోజనం, పుస్తకాలు, బట్టలు, వసతి కల్పిస్తున్నారాని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిధులను చెల్లించడం వలన ఈ పథకం సజావుగా సాగుతూ వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 180 కోట్ల ప్రైవేటు పాఠశాలలకు బకాయి పడిందని అన్నారు. విద్యార్థి సంఘాలు గత ఏడాది కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడంతో ఈ పథకంలోని విద్యార్థులకు విద్యతో పాటు భోజనం, వసతి కల్పించలేకపోతున్నామని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తూ అక్టోబర్ 6 నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయన్నారు.
ప్రభుత్వం బకాయిలు చెల్లించేంతవరకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించక పోవడంతో పాఠశాలల బయటే పిల్లలు వారి తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల మంది దళిత,గిరిజన విద్యార్థులు చదువుకు దూరమై రోడ్డున పడ్డా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికార బలంతో కాంట్రాక్టర్లు, బడా బాబులకు వేలకోట్ల రూపాయలు నిధులను విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళిత,గిరిజన పేద విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. బెస్ట్ అవైలబుల్ స్కీము చరిత్రలోనే ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు ఇలాంటి అవమానం ఎదు రుకావడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
గత వారం రోజులనుగా పాఠశాలలకు వెళ్లకుండా రోడ్డున పడ్డ దళిత గిరిజన విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయడంలో ఆర్థిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన శాఖా మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దళిత,గిరిజన శాసనసభ్యులు తక్షణం స్పందించి బకాయిలను విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఇప్పటికీ దుస్తులు పంపిణీ చేయలేదన్నారు. గత ఆరు నెలల గత నెలల నుండి కాస్మోడి చార్జీలు విడుదల కాక విద్యార్థులు హాస్టల్ బార్డర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. తక్షణమే సంక్షేమ హాస్టలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ జగన్, హిందురాణి, పుట్టల ఉదయ్ ,జిల్లా కమిటీ సభ్యులు నేహాల్, నరేందర్ పాల్గొన్నారు.