నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి పట్టణంలోని యుటిఎఫ్ భవన్ లో కెవిపిఎస్ కార్యదర్శి పులిజాల పరశురాములు బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోము అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవలేబుల్ స్కీం కింద పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో యుటిఎఫ్ భవనం లో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పులిజాల పరశురాములు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 180 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బకాయి డబ్బులు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విద్యార్థుల తల్లిదండ్రులతో కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని సందర్భంగా హెచ్చరించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన పాఠశాలల యాజమాన్యాల నిర్వహణ ఖర్చులు పెరిగి ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు చదువుకొనే బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా నాణ్యమైన చదువులు అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దూరం చేయొద్దని నాయకులు హెచ్చరించారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయకుంటే ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థి లోకం సామాజిక సంఘాలు తల్లిదండ్రుల నుండి ప్రత్యక్ష ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పులిజాల అశోక్. కెవిపిఎస్ కల్వకుర్తి మండల అధ్యక్షులు నారుమళ్ళ కుర్మయ్య. కేవిపీఎస్ నాయకులు జంతుక హరీష్. పులిజాల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బెస్ట్ అవలేబుల్ స్కీమ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES