- Advertisement -
నవతెలంగాణ – నాంపల్లి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నాంపల్లి మండలంలో అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ (ఏపీఓ) గా విధులు నిర్వహిస్తున్న గుంటుక వెంకటేశం తన ఉద్యోగ బాధ్యతలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఉత్తమ అవార్డును అందుకున్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పోలీసు అధికారి శరత్ చంద్ర పవార్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
- Advertisement -



