ఎంఈఓ లక్ష్మన్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న మొత్తం 170 మంది ఉపాద్యాయుల్లో విద్యార్థులకు విశిష్ట, ఉత్తమ సేవలందించిన 12 మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ ఆదేశాల మెరకు ఉత్తమ ఉపాధ్యాయు పురస్కారాలు 2025-26 విద్యా సంవత్సరానికి గాను మండల స్థాయి ఉత్తమ, ఉపాధ్యాయుల పురస్కారాలను బుధవారం మండలంలో కొయ్యుర్ ఎమ్మార్సీ భవనంలో ఎంపిక చేసి పురస్కారాలను అందజేసినట్లుగా మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు తెలిపారు.
పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులను ఎంఈఓ శాలువాలతో ఘనంగా సత్కరించి, ప్రశంస పత్రాలు అందజేశారు. పురస్కారాలు పొందింవారిలో నర్సింహారావు, మల్లారం హైస్కూల్, బిమేశ్వర్ రుద్రారం హైస్కూల్, స్వర్ణలత తాడిచెర్ల హైస్కూల్, నాగేశ్వరరావు ఎడ్లపల్లి మోడల్ స్కూల్, శైలజ కొత్త రుద్రారం ప్రాథమిక పాఠశాల, జలజ మల్లంపల్లి ప్రాథమిక పాఠశాల, శారదా కొయ్యుర్ ప్రాథమిక పాఠశాల, స్వర్ణ కుమారి వళ్లెంకుంట ప్రాథమిక పాఠశాల, రమాదేవి చిన్నతూoడ్ల ప్రాథమిక పాఠశాల, అరుణ్ కుమార్ తాడిచెర్ల ఎస్సికాలని ప్రాథమిక పాఠశాల, రాకెష్ కుమార్ తాడిచెర్ల ప్రాథమిక పాఠశాల, సరితా గాదంపల్లి ప్రాథమిక పాఠశాల. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిఅర్పిలు,ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.
12 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES