- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గత 11 రోజుల నుండి శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరములో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన చక్రిభజన కార్యక్రమాన్ని పురస్కరించుకొని హిందూ వాహిని కమిటీ వారు బెస్ట్ చక్రిభజన అవార్డును ఆదివారం అందజేసినారు. నిమజ్జోత్సవ సందర్భంలో గోల్ బంగ్లా దగ్గర ఆహ క్షత్రియ సమాజ్ అధ్యక్షులు రెడ్డిప్రకాష్, కార్యదర్శి బారడ్ గంగమోహన్, తెలంగాణ ప్రాంతీయ సమాజ్ సభ్యులు పడాల్ గణేష్, లయన్ నివేదన్ గుజరాతి , సంయుక్త కార్యదర్శి సంతని విజయ్ లకు అందజేసినారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ,హిందూ వాహిని కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -