నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లోని కాంతి హై స్కూల్ డైరెక్టర్ శ్రీ వేల్పూర్ శశాంక్ రెడ్డి కి బెస్ట్ ఎడ్యుకేటర్ (ఉత్తమ విద్యావేత్త) అవార్డు తో సత్కరించడం జరిగింది. విద్యా రంగంలో విశేష కృషి చేస్తున్న వారికి “స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్” నీసా అపుస్మా , ట్రాస్మా తో కలిసి అందజేసినారు. మల్ల బ్యూరో ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వారు దేశవ్యాప్తంగా అందించే ఎడుఐకాన్ 2025 అవార్డును అందజేసినారు. విశాఖపట్నంలోని హోటల్ ఫెయిర్ ఫీల్డ్ మ్యారియట్ లో జరిగిన అవార్డ్స్ లో భాగంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు , గీతం విద్యాసంస్థల అధ్యక్షులు మాతకుమిల్లి భరత్ గారి, నిసా అధ్యక్షులు కులభూషణ్ శర్మ, అపుస్మా చీఫ్ మెంటర్ కృష్ణారెడ్డి, మల్లు బ్యూరో అధ్యక్షులు మల్లు రాము నాయుడు, మల్లు శ్రీవాణి చేతులమీదుగా కాంతి హై స్కూల్ డైరెక్టర్ బెస్ట్ ఎడ్యుకేటర్ (ఉత్తమ విద్యావేత్త) అవార్డు తో సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా శుక్రవారం డైరెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ఉత్తమ విద్యా సంస్థగా పలుమార్లు, ఆగస్టులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ డైరెక్టర్ అవార్డు ఇప్పుడు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు లభించడం చాలా సంతోషాన్ని, బాధ్యతను రెట్టింపు చేసినట్లుగా భావిస్తూ మునుముందు ఇదే ఉత్సాహంతో చేస్తానని అన్నారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా విద్యార్థిని విద్యార్థుల లక్ష్యాలను చేరుకునే విధంగా నా ప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. పాఠశాల వ్యవస్థాపకులు కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వివిధ సత్కారాలతో, అవార్డులతో మా బాధ్యత గుర్తు చేస్తూ వస్తున్నాయి. కాంతి హై స్కూల్ కు ఈ సంవత్సరం ఆగస్టులో శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుతో, ఇప్పుడు బెస్ట్ ఎడ్యుకేటర్అవార్డుతో సత్కరించడం చాలా ఆనందదాయకం, సంతోషకరం.
కాంతి హై స్కూల్ అంటేనే ఉత్తమ విద్యకు, క్రీడలకు ప్రామాణికం అని అది ప్రతి సంవత్సరం పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతతో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో వాటి ఫలితాల్లో వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇది సమిష్టి కృషి, మా విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి సహకారం తో ఉపాధ్యాయని, ఉపాధ్యాయుల తోడ్పాటు విద్యార్థిని, విద్యార్థుల కృషి, పట్టుదలతో సాధిస్తూ వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి మా ప్రయత్నం అనేది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.
కాంతి హైస్కూల్ డైరెక్టర్ కు బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



