– మండల ఉత్తీర్ణత శాతం 99.8..
– ఎంఈవో పొన్నగంటి ప్రసాదరావు.
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఈ ఏడాది పదో తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించామని ఎంఈవో పొన్నగంటి ప్రసాదరావు తెలిపారు.తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం పదోతరగతి ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన నవతెలంగాణ కు పాఠశాలలు వారీగా,మండలం ఉత్తీర్ణత శాతం వివరాలను వెల్లడించారు.
మండలంలో మొత్తం 23 పాఠశాలలు నుండి 654 మంది పదో తరగతి పరీక్షలకు ఫీజు కట్టి,651 పరీక్షలు రాయగా 650 మంది ఉత్తీర్ణత సాధించారు.ఒకరు మాత్రమే ఫెయిల్ అయ్యారు.దీంతో మండల ఉత్తీర్ణత శాతం 99.8 గా నమోదు అయింది అని అన్నారు.
అశ్వారావుపేట బాలురు పాఠశాలకు చెందిన కే.కీర్తి శ్రీ 576,బాలికల పాఠశాలకు చెందిన ఎస్.కే యాస్మిన్ 577,మామిళ్ళవారిగూడెం విద్యార్ధిని రవళి 575,గుమ్మడి వల్లి విద్యార్ధులు డి.చందన,వి.యశశ్విని 551,నారాయణపురం విద్యార్ధిని మాలతి 553,సున్నం బట్టి విద్యార్ధి టి.అజయ్ బాబు 549,భీముని గూడెం విద్యార్ధిని కే.రూతు 553,ఎంజేపీటీ బీసీ గురుకులం విద్యార్ధిని అపర్ణ 569,గుడ్ న్యూస్ స్కూల్ విద్యార్ధిని రమ్య 573,జవహర్ స్కూల్ విద్యార్ధి సాయి సంతోష్ 580,గౌతమి స్కూల్ విద్యార్ధి మోహిత సాయి 570,సూర్య స్కూల్ విద్యార్ధులు సోమనాథ్,సాదిక్ 572 చొప్పున మార్కులు సాధించి మొదటి వరుసలో నిలిచారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులను మండల విద్యాశాఖ అధికారి పొన్నగంటి ప్రసాదరావు,ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి.హరిత,ఎన్.కొండలరావు,షాహి నా బేగం,టి.వీరేశ్వరరావు,పద్మావతి,సరోజిని,రాంబాబు,సుశీల,పద్మావతి,వెంకటేశ్వర్లు,భావ్ సింగ్,నిరోషా,రేణుక రాణి,సంగీత,ప్రవీణ్,చలపతి రావు,రాంబాబు లు అభినందనలు తెలిపారు
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు…
- Advertisement -