Saturday, January 10, 2026
E-PAPER
Homeఖమ్మంలక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు

లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు

- Advertisement -

– వ్యక్తిత్వ వికాస నిపుణులు సురేందర్
నవతెలంగాణ – అశ్వారావుపేట

విద్యార్థి దశ నుండే ఏదో ఒక లక్ష్యంతో విద్యను అభ్యసిస్తే ఉత్తమ ఫలితాలు చేరుకుంటారని, ఇందుకోసం సెల్ఫోన్, టీవీ, సినిమాలకు దూరంగా ఉండాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు కే. సుందర్ విద్యార్ధులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత అద్యక్షతన కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో సంకల్పం సేవా సంస్థ సహకారంతో శుక్రవారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ నిర్వహించారు.

ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రముఖుల యొక్క జీవిత చరిత్రలను తెలుసుకోవాలని, వారు సాదించిన విజయాలను వివరిస్తూ విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. ప్రతి విద్యార్థి విజయం సాధించాలంటే ఖచ్చితమైన నిర్ణయం పటిష్టమైన ప్రణాళిక వృత్తి పట్ల  నిబద్ధత మారిన కాలానికి అనుగుణంగా  తమని తాము మలుచుకోవడం మనలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని అధిగమించడం, మనం చేసే పనిలో ఎన్ని ఒడిదుడుకులు  వచ్చినా ధైర్యంగా నిలబడి ముందుకు సాగితే విజయాలు అవే మిమ్ములను వరిస్తాయని, ఆ విజయాలే మిమ్మలను ఈ సమాజానికి హీరోలుగా పరిచయం చేస్తాయని  కావున మీరందరూ మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మలుచుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని, మీరు భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏం చేయాలి మీరే నిర్ణయించుకోవాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ.. విద్యార్థుల లక్ష్యాలను తెలుసుకొని వాటిని సులభతరంగా ఎలా సాధించవచ్చో తెలిపి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అనంతరం ప్రిన్సిపాల్ అనిత మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ప్రణాళిక బద్దంగా చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డేగల నరసింహారావు,ఏపీఓ మానే శ్రీనివాసరావు,కళాశాల ఏజీఎంఓ అరవింద్ బాబు, స్టూడెంట్స్ కౌన్సిలర్ ఎం.అశోక్ బాబు, అధ్యాపకులు కళాశాల సిబ్బంది విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -