- Advertisement -
– గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రజలకు రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బాబూ జగ్జీవన్ రామ్ జాతీయ నాయకులనీ, స్వాతంత్య్ర సమరయోధులనీ, సామాజిక న్యాయానికి ఛాంపియన్ అని గుర్తుచేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని తెలిపారు. సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావం ప్రగతిశీల భారతదేశ నిర్మాణంలో దోహదపడిందని తెలిపారు. ఆయన ఆలోచనలు నిరంత రాయం నిలిచి ఉంటాయనీ, తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయనీ, మానవీయ సమాజాన్ని తయారు చేస్తుందని తెలిపారు.
- Advertisement -


