తొలి వన్డేలో ఆసీస్ మహిళల గెలుపు
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) : టీ20 సిరీస్ సాధించిన ఉత్సాహంలో ఉన్న టీమ్ ఇండియా అమ్మాయిలకు బ్రిస్బేన్‌లో బ్రేక్ పడింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0తో బోణీ కొట్టింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 38.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ అలీసా హీలే (50, 70 బంతుల్లో 4 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెరువగా.. బెత్ మూనీ (76, 79 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో విరుచుకుపడింది. ఆఖర్లో అనాబెల్ సుథర్‌లాండ్ (48 నాటౌట్, 44 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) తనదైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 38.2 ఓవర్లలో 4 వికెట్లకు 217 పరుగులు చేసిన ఆసీస్..మరో 70 బంతులు ఉండగానే లాంఛనం ముగించింది. అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 48.3 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయ్యారు. స్మృతీ మంధాన (58, 68 బంతుల్లో 7 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (53, 84 బంతుల్లో 3 ఫోర్లు), కాశ్వీ గౌతమ్ (43, 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిసినా.. భారత్ స్వల్ప స్కోరుకు కుప్పకూలింది. ప్రతీక రావల్ (0), షెఫాలీ వర్మ (4), జెమీమా రొడ్రిగ్స్ (8), దీప్తి శర్మ (2) నిరాశపరిచారు. బెత్ మూనీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.
బెత్‌మూనీ దంచికొట్టెన్
- Advertisement -
- Advertisement -



