Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడల్ స్కూల్ లో బేటి బచావో – బేటి పడావో

మోడల్ స్కూల్ లో బేటి బచావో – బేటి పడావో

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి 
మండల కేంద్రములోని మోడల్ పాఠశాలలో బుధవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమము నిర్వహించారు. ఈసందర్బంగా మహిళా–శిశు–వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహకారంతో AR ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా డిచిపల్లి ప్రాజెక్ట్ పరిధిలోని దర్పల్లి మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్ మరియు ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులకు TOT (Training of Trainers) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి జ్యోతి గారు హాజరై, సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్షతపై మాట్లాడారు. బాలురు–బాలికల మధ్య సమానత్వం అవసరాన్ని వివరించి, భవిష్యత్‌లో సమాన సమాజ నిర్మాణంలో బాలుర పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. అలాగే బేటి బచావో – బేటి పడావో కార్యక్రమ లక్ష్యాలను వివరించి, లింగ వివక్షత నిర్మూలనలో యువత భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.

AR ఎడ్యుకేషన్ ట్రైనర్ అపర్ణ మేడం గారు విద్యార్థులకు చైల్డ్ రైట్స్, కెరీర్ గైడెన్స్, పబ్లిక్ స్పీకింగ్, కెపాసిటీ బిల్డింగ్, జెండర్ ఈక్వాలిటీ, పోక్సో చట్టం పరిచయం, పర్సనాలిటీ డెవలప్మెంట్, బై స్టాండర్ ఇంటర్వెన్షన్, టైమ్ మేనేజ్‌మెంట్, గోల్ సెట్టింగ్, సాఫ్ట్ స్కిల్స్ మరియు మహిళ సాధికారత వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.అనంతరం  బాలురు–బాలికల మధ్య సమాన హక్కులు, పరస్పర గౌరవం మరియు అవగాహన గురించి వివరించడంతో పాటు, మహిళలు మరియు బాలికలపై వివక్ష, హింసను నివారించడంలో బాలుర పాత్ర ఎంతో ముఖ్యమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు సరిత గారు, బుజ్జి గారు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు DHEW సిబ్బంది సౌమ్య, పుష్ప, కవిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -