Thursday, December 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించాలి

గ్రామాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించాలి

- Advertisement -

నూతన ప్రజా ప్రతినిధులకు మంత్రి పొంగులేటి సూచన

నవతెలంగాణ -కూసుమంచి
ప్రతి గ్రామంలో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యతని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ప్రజా ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు శాలువా కప్పి, స్వీట్లు తినిపించి మంత్రి అభినందనలు తెలిపారు. ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కూడా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా, బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు అధైర్యపడొద్దని, పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని తెలిపారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగి గ్రామాలను అభివృద్ధి పరచాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -