– జిల్లా ప్రోగ్రాం అధికారి సుప్రజ
నవతెలంగాణ – రాయపోల్ : గర్భిణీలు, బాలింతలు సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యవంతంగా ఉండగలరని జిల్లా ప్రోగ్రాం అధికారి సుప్రజ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాయపోల్ మండల కేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్, క్రై ఆర్గనైజేషన్, మాత శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్వాడి సేవలపై కళాజాత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం అందజేస్తోందని తెలిపారు. తల్లి ఆరోగ్యం బాగుంటేనే శిశువు ఆరోగ్యంగా పెరుగుతారని, అందుకే గర్భిణీలు తప్పనిసరిగా సమయానికి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. బాలింతలు కూడా శిశువుకు తగినంత పాలు అందించేందుకు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల సమగ్ర అభివృద్ధికి కీలకంగా నిలుస్తున్నాయని, చిన్న వయస్సులోనే పిల్లలలో పాఠశాలకు వెళ్లే అలవాటును పెంపొందిస్తున్నాయని తెలిపారు. ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా పిల్లలలో నేర్చుకునే ఆసక్తిని పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. పిల్లలలో శారీరక, మానసిక వికాసం సమతుల్యంగా ఉండేలా అంగన్వాడీ టీచర్లు కృషి చేస్తున్నారని చెప్పారు.ప్రతి నెల పిల్లల బరువును తూకం వేస్తూ వారి ఎదుగుదలపై నిఘా ఉంచుతున్నామని, పోషకాహార లోపాలు ఉంటే తల్లిదండ్రులకు సూచనలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమానికి ముందు కళాకారులు అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యత, ఉచిత విద్య, బాలల హక్కులపై నృత్యాలు, జానపద గేయాలు, నాటికల రూపంలో సందేశాలు అందించి గ్రామ ప్రజల్లో చైతన్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ షబానా, గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, బ్లాక్ కోఆర్డినేటర్ భాస్కర్, సౌత్ ఎవల్యూషన్ హెడ్ భవ్య, సీఆర్పీలు సుమతి,అంజలి,అంగన్వాడీ టీచర్లు ఆగమ్మ, రేఖ,పద్మ,సంతోష, గ్రామ పెద్దలు, మహిళలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే గర్భిణీలు, బాలింతలకు మెరుగైన ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



