మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజు భార్గవి
నవతెలంగాణ – చారకొండ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యార్థులకు మెరుగైన వైద్యం సాధ్యమవుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజు భార్గవి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు సోమవారం మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టల్లో ఉండే విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఉంటే గుర్తించి, చికిత్స అందిస్తామన్నారు.
విద్యార్థులు విధిగా మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వాస్పత్రిని సందర్శించాలన్నారు. ఎస్సీ హాస్టల్ లో 95 మంది విద్యార్థులకు గాను 65 మందికి హెల్త్ చెకప్ లు నిర్వహించామని, విద్యార్థులకు ఎలాంటి వైరల్ ఫీవర్లు, అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సృజన, డాక్టర్ మంజు భార్గవి, బలరాం సిహెచ్ఓ , వార్డెన్ బాలరాజ్,సిబ్బంది కృపమ్మ, అలివేలమ్మ, సువర్ణ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యార్థులకు మెరుగైన వైద్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES