- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్:
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ కోరారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో, వైద్య సిబ్బందితో ఆమె మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై మండల వైద్యాధికారి శ్వేతను అడిగి తెలుసుకున్నారు. యాంటీ రాబిస్, యాంటీవీనం ఔషధాలను అందుబాటులో ఉంచాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
- Advertisement -



