Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం

పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం

- Advertisement -

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ విజయలక్ష్మి
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికను చేపట్టింది. ఇందులో భాగం గా మండల ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు గాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ఉమాకాంత్ మాట్లాడుతు ఆరోగ్య శిబిరంలో భాగంగా సుమారు 2 వందలకు పైగా రోగులకు పరీక్షలు నిర్వహిం చామన్నారు ఈ శిబిరంలో ఎముకల,దంతాల,గైనిక్ సమస్యలకు సంబందిం చిన వైద్యులు పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ శిబిరం నిర్వహించామని ఉమాకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అఖిల్,నిఖిల్, దేవేందర్,వేద,వెంకటస్వామి రమాదేవి,పార్మాసిస్ట్ అనిత, సూపర్ వైజర్ ప్రిసిల్లా,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -