Monday, May 19, 2025
Homeజాతీయంఇరు దేశాల డీజీఎంఓల మధ్య

ఇరు దేశాల డీజీఎంఓల మధ్య

- Advertisement -

– ఇవాళ ఎలాంటి చర్చల్లేవు
– పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ కీలక ప్రకటన
ఢిల్లీ :
పాకిస్తాన్‌తో కాల్పుల విరమన ఒప్పందానికి సంబంధించి తాజాగా భారత ఆర్మీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈరోజుతో సీజ్‌ఫైర్‌ ముగుస్తుందన్న వార్తలను ఖండించింది. ఇండియా, పాకిస్తాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంఓ)ల మధ్య ఇవాళ ఎలాంటి చర్చలకు ప్లాన్‌ చేయలేదని తెలిపింది. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని ప్రకటించింది. ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని ఇండియన్‌ ఆర్మీ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -